Share News

12 ఏళ్ల తర్వాత పోక్సో కేసులో ముద్దాయిని పట్టుకున్న విశాఖ పోలీసులు

ABN , Publish Date - Jan 26 , 2026 | 06:10 PM

విశాఖ టూటౌన్ పోలీసులు 12 ఏళ్ల తర్వాత పోక్సో కేసులో ముద్దాయిగా ఉన్న ఓ వ్యక్తిని పట్టుకున్నారు. ఉత్తర్ ప్రదేశ్‌లో దాక్కున్న అతడ్ని స్థానిక పోలీసుల సాయంతో అదుపులోకి తీసుకున్నారు.

12 ఏళ్ల తర్వాత పోక్సో కేసులో ముద్దాయిని పట్టుకున్న విశాఖ పోలీసులు
Visakhapatnam POCSO case

అమరావతి, జనవరి 26: విశాఖపట్నం టూటౌన్ పోలీసులు 12 ఏళ్ల తర్వాత పోక్సో కేసులో ముద్దాయిగా ఉన్న ఓ వ్యక్తిని పట్టుకున్నారు. ఉత్తర్ ప్రదేశ్‌లో దాక్కున్న అతడ్ని స్థానిక పోలీసుల సాయంతో అదుపులోకి తీసుకుని.. విశాఖకు తీసుకువచ్చారు. ఇంతకీ సంగతేంటంటే..


12 ఏళ్ల క్రితం విశాఖపట్నానికి చెందిన సల్మాన్ అనే వ్యక్తి ఓ బాలికపై అత్యాచారం చేశాడు. అనంతరం విశాఖను వదిలి పరారయ్యాడు. ఈ నేపథ్యంలో కోర్టు అతడిపై వారెంట్ జారీ చేసింది. పోలీసులు అతడి కోసం తీవ్రంగా అన్వేషిస్తున్నారు. ఇంతలో నిందితుడు సల్మాన్ ఉత్తర్ ప్రదేశ్‌లో తలదాచుకుంటున్నట్టు తెలిసింది. దీంతో విశాఖ టూటౌన్ పోలీసులు ఆ రాష్ట్రానికి వెళ్లారు. స్థానిక పోలీసుల సాయంతో నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా అతడ్ని యూపీ నుంచి విశాఖకు తీసుకువచ్చారు.


ఇవి కూడా చదవండి

పాకిస్థాన్‌ను ఆ దేవుడే కాపాడుతున్నాడు.. ఈ కరెంట్ స్తంభం చూస్తే అశ్చర్యపోవాల్సిందే..

బీఎంసీ మేయర్‌పై ప్రతిష్టంభన.. ఫడ్నవిస్, షిండే భేటీ

Updated Date - Jan 26 , 2026 | 06:39 PM