వైజాగ్ అబ్బాయి.. దక్షిణకొరియా అమ్మాయి!
ABN , Publish Date - Nov 23 , 2026 | 04:34 AM
వారిద్దరిదీ వేర్వేరు దేశాలు. తొలుత ఆన్‌లైన్‌లో పరిచయమయ్యారు. ఒకరినొకరు ఇష్టపడ్డారు
ఆన్‌లైన్‌లో పరిచయం.. ప్రేమ.. సత్యదేవుడి సన్నిధిలో పెళ్లి
అన్నవరం, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): వారిద్దరిదీ వేర్వేరు దేశాలు. తొలుత ఆన్‌లైన్‌లో పరిచయమయ్యారు. ఒకరినొకరు ఇష్టపడ్డారు. కొంతకాలంగా రాష్ట్రంలో పలు ప్రాంతాలు చుట్టివచ్చారు. ఎల్లలు దాటిన ప్రేమతో సత్యదేవుడి సాక్షిగా ఒక్కటయ్యారు. విశాఖపట్నానికి చెందిన ఎన్.కృష్ణదీపక్, దక్షిణకొరియాకు చెందిన జి.యోన్‌ల ప్రణయగాథ ఇది. ఇంతకాలం ఒకరినొకరు అర్థం చేసుకుని పలు ఆలయాలు, పర్యాటక ప్రాంతాల్లో పర్యటించి సోషల్‌మీడియాలో వైరల్ అయ్యారు. చివరికి మూడుముళ్ల బంధంతో ఒక్కటవ్వాలని నిర్ణయించుకుని శనివారం రాత్రి హిందూ సంప్రదాయ పద్ధతిలో కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో వివాహం చేసుకున్నారు. ఆదివారం ఉదయం సత్యదేవుడి వ్రతమాచరించి స్వామిని దర్శించుకున్నారు. ఈజంటను ఇప్పటివరకు సోషల్‌మీడియాద్వారా చూసినవారంతా ఆదివారం ప్రత్యక్షంగా కనిపించడంతో ఆసక్తిగా చూశారు. వీరితో పలువురు సెల్ఫీలు దిగారు.
ఈ వార్తలూ చదవండి
పార్టీకి నష్టపరిచేలా మాట్లాడితే చర్యలు.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్
పది లక్షల పుస్తకాల సేకరణే లక్ష్యం!