Share News

విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో మహిళపై అత్యాచారం.. యువకుడి అరెస్ట్..

ABN , Publish Date - Apr 30 , 2026 | 01:11 PM

విశాఖ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌లో వివాహితపై అత్యాచారం చేసిన యువకుడిని విజయవాడ రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని ఒడిశా రాష్ట్రానికి చెందిన శౌరవ్ బగ్దిగా గుర్తించారు.

విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో మహిళపై అత్యాచారం.. యువకుడి అరెస్ట్..
Visakha Express Case

అమరావతి, ఏప్రిల్ 30: విశాఖ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌లో వివాహితపై అత్యాచారం చేసిన యువకుడిని విజయవాడ రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని ఒడిశా రాష్ట్రానికి చెందిన శౌరవ్ బగ్దిగా గుర్తించారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. పల్నాడు జిల్లా రెంటచింతలకు చెందిన భార్యాభర్తలు ఉపాధి నిమిత్తం విశాఖపట్నంలో స్థిరపడ్డారు. గత ఆదివారం సాయంత్రం సొంతూరుకు వెళ్లేందుకు విశాఖ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఎక్కారు. జనరల్ బోగీలో బాగా రద్దీగా ఉండటంతో దంపతులిద్దరూ బాత్‌రూము దగ్గర కూర్చున్నారు.


ఏసీ బోగీలో బాయ్‌‌గా పని చేస్తున్న శౌరవ్ బగ్ది.. దంపతులిద్దరినీ ఏసీ బోగీలో కూర్చోవచ్చని పిలిచాడు. ఇద్దరూ ఏసీ కోచ్‌లోకి వెళ్లిన తర్వాత భర్త బాత్‌రూమ్ దగ్గర సెల్‌ఫోన్ చూసుకుంటూ నిలబడిపోయాడు. భార్య శౌరవ్‌తో పాటు లోపలకు వెళ్లింది. ఇదే అదునుగా భావించిన యువకుడు ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ విషయం బయటకు తెలిస్తే రైలులో గొడవలు జరుగుతాయనే భయంతో బాధితురాలు భర్తకు చెప్పలేదు.


ఇంటికి వచ్చిన తర్వాత భార్య ముభావంగా ఉండటంతో భర్త గట్టిగా నిలదీశాడు. దీంతో ఆమె జరిగిన దారుణాన్ని బయటపెట్టింది. ఇద్దరూ కలిసి రెంటచింతల పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి విజయవాడ రైల్వే పోలీసులకు బదిలీ చేశారు. రైల్వే పోలీసులు నిన్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.


ఇవి కూడా చదవండి

ఇదెక్కడి ట్యాలెంట్ నాయనా.. ఇటుకలు, సిమెంట్‌తో కారును ఎలా రిపేర్ చేస్తున్నాడో చూడండి..

పుతిన్ ఆఫర్‌ను తిరస్కరించిన ట్రంప్.. 90 నిమిషాలు మాట్లాడుకున్న నేతలు..

Updated Date - Apr 30 , 2026 | 01:17 PM