Share News

సోనోవిజన్‌ లక్కీడ్రాలో విజయవాడ వాసికి అమేజ్‌ కారు

ABN , Publish Date - Nov 11 , 2026 | 05:09 AM

సోనోవిజన్‌ నిర్వహించిన లక్కీడ్రాలో విజయవాడ వన్‌టౌన్‌కు చెందిన పిలకా శ్రీకాంత్‌రెడ్డి హోండా అమేజ్‌ కారును గెలుచుకున్నారు.

సోనోవిజన్‌ లక్కీడ్రాలో  విజయవాడ వాసికి అమేజ్‌ కారు

  • వినియోగదారుల విశ్వసనీయతే సంస్థ అభివృద్ధికి కారణం: ఎండీ భాస్కరమూర్తి

విజయవాడ(గుణదల), నవంబరు 10(ఆంధ్రజ్యోతి): సోనోవిజన్‌ నిర్వహించిన లక్కీడ్రాలో విజయవాడ వన్‌టౌన్‌కు చెందిన పిలకా శ్రీకాంత్‌రెడ్డి హోండా అమేజ్‌ కారును గెలుచుకున్నారు. ఏలూరు రోడ్డులోని సోనోవిజన్‌ షోరూమ్‌లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ లక్కీ డ్రా తీసి మొదటి బహుమతి విజేతను ఎంపిక చేశారు. ప్రత్యేక అతిథి కార్పొరేటర్‌ నెలిబండ్ల బాలస్వామి లక్కీ డ్రా తీసి రెండో బహుమతి విజేతను ఎంపిక చేశారు.

కంచికచర్ల హనుమాన్‌పేటకు చెందిన ఎ.సతీశ్‌ రెండో బహుమతిగా ఎల్‌ఈడీ టీవీ, గొల్లపూడికి చెందిన ఆర్‌.సతీశ్‌కుమార్‌ మూడో బహుమతి రిఫ్రిజిరేటర్‌, మొగల్రాజపురానికి చెందిన ఆర్‌.సంయుక్త నాలుగో బహుమతి వాషింగ్‌ మెషిన్‌ గెలుచుకున్నారు. ఈ కార్యక్రమంలో సోనోవిజన్‌ ఎండీ పొట్లూరి భాస్కరమూర్తి, సంస్థ చైర్మన్‌ పొట్లూరి జనార్దనమూర్తి పాల్గొన్నారు. వినియోగదారుల విశ్వసనీయతే సంస్థ అభివృద్ధికి కారణమని భాస్కరమూర్తి తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

విశాఖ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ సేవల రద్దు

30 ఏళ్లు దాటినా రాజీవ్ గాంధీ భౌతికకాయం ఫొటో చూడని సోనియా!

Updated Date - Nov 11 , 2026 | 05:09 AM