విజయవాడ ఆటోనగర్‌లో అగ్నిప్రమాదం.. 7 ప్రైవేట్ బస్సుల దగ్ధం
ABN , Publish Date - Jul 12 , 2026 | 01:41 PM
విజయవాడలోని ఆటోనగర్‌లో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. 7 బస్సులు కాలిపోయాయి. మరమ్మతుల కోసం ఉంచిన బస్సులో మంటలు చెలరేగటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఇంటర్‌నెట్ డెస్క్: విజయవాడలోని ఆటోనగర్‌లో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. 7 బస్సులు కాలిపోయాయి. మరమ్మతుల కోసం ఉంచిన బస్సులో మంటలు చెలరేగటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఆటోనగర్‌లోని ఓ మెకానిక్ షెడ్డులో మరమ్మతుల కోసం బస్సులను నిలిపి ఉంచారు. ఆదివారం మధ్యాహ్నం మరమ్మతుల కోసం ఉంచిన ఓ బస్సులో మంటలు చెలరేగాయి. ఆ మంటలు కొద్దిసేపటికి మిగిలిన బస్సులకు వ్యాపించాయి.
పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటం గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. మూడు ఫైరింజన్లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఇక, ఈ ప్రమాదంలో గ్యారేజీలో నిలిపి ఉంచిన ఏడు బస్సులు దగ్ధం అయ్యాయి. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణం నష్టం సంభవించలేదని తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
అయ్యో పాపం.. నీళ్లనుకుని యాసిడ్ తాగిన మహిళ..
ఈ 4 రాశుల వారు డబ్బు విషయంలో జాగ్రత్త..