Share News

రూ.44 లక్షల వార్షిక వేతనంతో అమెజాన్‌లో విజ్ఞాన్స్‌ లారా విద్యార్థినికి ఉద్యోగం

ABN , Publish Date - Nov 20 , 2026 | 01:45 AM

గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్‌ లారా ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థిని టి.మానస అమెజాన్‌లో ఉద్యోగం సాధించిందని ...

రూ.44 లక్షల వార్షిక వేతనంతో అమెజాన్‌లో విజ్ఞాన్స్‌ లారా విద్యార్థినికి ఉద్యోగం

గుంటూరు (విద్య), నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్‌ లారా ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థిని టి.మానస అమెజాన్‌లో ఉద్యోగం సాధించిందని ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.ఫణీంద్ర కుమార్‌ తెలిపారు. కళాశాలలో నాలుగో సంవత్సరం బీటెక్‌ చదువుతున్న మానస రూ.44 లక్షల వార్షిక వేతనంతో సాఫ్ట్‌వేర్‌ డెవల్‌పమెంట్‌ ఇంజనీర్‌గా అమెజాన్‌కు ఎంపికైందని గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

మొదటి ఏడాది ఇంటర్న్‌షిప్‌లో భాగంగా ఆమె నెలకు రూ.1.30 లక్షల వేతనం అందుకోనుందని చెప్పారు. ఇంటర్న్‌షిప్‌ను విజయవంతంగా పూర్తిచేసిన అనంతరం పూర్తిస్థాయిలో సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌గా బాధ్యతలు చేపడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో విజ్ఞాన్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య తదితరులు మానసను అభినందించారు.

ఈ వార్తలనూ చదవండి:

ఏపీ తీరానికి అక్వాన్ తుపాను ముప్పు.. గోపాల్‌పూర్ సమీపంలో తీరం దాటే అవకాశం: ఏపీఎస్‌డీఎంఏ

బాలకృష్ణకు విశిష్ట పురస్కారం.. రేవంత్ సర్కార్ నుంచి అరుదైన గౌరవం

Updated Date - Nov 20 , 2026 | 01:45 AM