శ్రీవారిని దర్శించుకున్న ఉప రాష్ట్రపతి
ABN , Publish Date - Oct 27 , 2026 | 04:52 AM
రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ సోమవారం సాయంత్రం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అర్చక బృందం ఆలయ మర్యాదలతో ఇస్తికఫాల్ స్వాగతం పలుకగా.. టీటీడీ ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణతో కలిసి ఆలయం లోపలకు వెళ్లారు.
పున్నమి గరుడ సేవలో సీపీ రాధాకృష్ణన్
తిరుమల, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ సోమవారం సాయంత్రం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అర్చక బృందం ఆలయ మర్యాదలతో ఇస్తికఫాల్ స్వాగతం పలుకగా.. టీటీడీ ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణతో కలిసి ఆలయం లోపలకు వెళ్లారు. తొలుత ధ్వజస్తంభానికి నమస్కరించుకుని తర్వాత మూలవిరాట్టును సేవించారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు ఉపరాష్ట్రపతికి వేద ఆశీర్వచనం అందించారు. టీటీడీ ఈవో, అదనపు ఈవో స్వామి వారి చిత్ర పటాన్ని, తీర్థప్రసాదాలను అందజేశారు.
అనంతరం ఉపరాష్ట్రపతి బేడి ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, టీటీడీ బోర్డు సభ్యులు రామ్మూర్తి, దివాకర రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. కాగా, తిరుమలలో సోమవారం రాత్రి పౌర్ణమి గరుడ సేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన మలయప్పస్వామి గరుడ వాహనంపై నాగవీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, మంత్రి అనగాని సత్యప్రసాద్ గరుడ సేవలో పాల్గొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా బలపడిన ‘అర్నబ్’
అతి తీవ్ర తుఫాను..ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్