Share News

ఇన్‌చార్జి డీహెచ్‌గా వెంకట రమణ

ABN , Publish Date - Sep 30 , 2026 | 05:02 AM

రాష్ట్ర ప్రజారోగ్య శాఖ ఇన్‌చార్జి డైరెక్టర్‌గా (డీహెచ్‌) వెంకట రమణను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డీహెచ్‌ పోస్టు కోసం ఆరోగ్య శాఖ ఏడుగురు అధికారుల పేర్లను పరిశీలించింది.

ఇన్‌చార్జి డీహెచ్‌గా వెంకట రమణ

అమరావతి, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రజారోగ్య శాఖ ఇన్‌చార్జి డైరెక్టర్‌గా (డీహెచ్‌) వెంకట రమణను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డీహెచ్‌ పోస్టు కోసం ఆరోగ్య శాఖ ఏడుగురు అధికారుల పేర్లను పరిశీలించింది. వీరిలో ఇద్దరిపై నమోదైన ఆరోపణలపై విచారణ జరుగుతోంది. మరో ఇద్దరికి కీలకమైన డీఎం అండ్‌ హెచ్‌వోలుగా విధులు నిర్వహించిన అనుభవం లేదు. ఇద్దరు సీనియర్‌ వైద్యుల సర్వీసు తక్కువగా ఉండడంతో వెంకటరమణను డీహెచ్‌గా నియమించేందుకు ఆరోగ్యశాఖ మంత్రి ఆమోదం తెలిపారు. గత 33 నెలలుగా డీహెచ్‌గా విధులు నిర్వహించిన పద్మావతి బుధవారం పదవీ విరమణ చేస్తున్నారు.

ఈ వార్తలనూ చదవండి..

హై బీమ్‌ ఎల్‌ఈడీ లైట్లతో అగచాట్లు

వేర్వేరు ఘటనల్లో ఐదుగురి బలవన్మరణం

Updated Date - Sep 30 , 2026 | 05:02 AM