నిధి పోర్టల్‌లో డీఏ బిల్లులకు అవకాశం ఇవ్వాలి: యూటీఎఫ్
ABN , Publish Date - Oct 03 , 2026 | 04:27 AM
ఏ బకాయిల బిల్లులు సమర్పించేందుకు నిధి పోర్టల్‌లో అవకాశం ఇవ్వాలని యూటీఎఫ్ అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు కోరారు. విజయవాడలో శుక్రవారం జరిగిన యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ సమావేశంలో...
అమరావతి, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): డీఏ బకాయిల బిల్లులు సమర్పించేందుకు నిధి పోర్టల్‌లో అవకాశం ఇవ్వాలని యూటీఎఫ్ అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు కోరారు. విజయవాడలో శుక్రవారం జరిగిన యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. 2018 నుంచి 2026 వరకు డీఏ బకాయిల బిల్లులు పెట్టుకునేందుకు సీఎఫ్ఎంఎస్‌లో టైల్స్ ఓపెన్ చేయకపోవడంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. అలాగే రిటైర్ అయిన ఎయిడెడ్ టీచర్లకు గ్రాట్యుటీ బకాయిలు చెల్లింపునకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ వార్తలనూ చదవండి..
స్వచ్ఛతే ఆరోగ్యానికి తొలిమెట్టు
శ్రీవారి ఆలయానికి ‘స్వచ్ఛ’ అవార్డు