Share News

నౌకా నిర్మాణంలో ప్రపంచ దేశాలతో పోటీ

ABN , Publish Date - Nov 13 , 2026 | 03:52 AM

నౌకా నిర్మాణ రంగంలో భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతూ ప్రపంచ దేశాలకు పోటీ ఇస్తోందని కేంద్ర పోర్టులు, షిప్పింగ్‌, జల రవాణా శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్‌ అన్నారు.

నౌకా నిర్మాణంలో ప్రపంచ దేశాలతో పోటీ

  • కేంద్ర మంత్రి శర్బానంద సోనోవాల్‌

  • వచ్చే మార్చికి మూడు పోర్టులు సిద్ధం: మంత్రి జనార్దన్‌రెడ్డి

విశాఖపట్నం, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): నౌకా నిర్మాణ రంగంలో భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతూ ప్రపంచ దేశాలకు పోటీ ఇస్తోందని కేంద్ర పోర్టులు, షిప్పింగ్‌, జల రవాణా శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్‌ అన్నారు. విశాఖలోని సీఐఐ పెట్టుబడిదారుల సదస్సులో పోర్టులు, షిప్‌ బిల్డింగ్‌ అంశాలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అందులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. రూ.10 వేల కోట్లతో కంటెయినర్ల తయారీ పరిశ్రమను ప్రోత్సహిస్తున్నామని, సాగరమాల కింద రూ. 80 లక్షల కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయని చెప్పారు.

విశాఖ పోర్టులో తాజాగా రూ. 600 కోట్లతో కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశామని తెలిపారు. రాష్ట్ర మంత్రి బీసీ జనార్దనరెడ్డి మాట్లాడుతూ... రాష్ట్రంలో పోర్టులు, సముద్ర రంగాల్లో పరిశ్రమల విస్తరణకు రూ. 22 వేల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు. వచ్చే మార్చికి రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టుల కార్యాకలాపాలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.

ఈ వార్తలనూ చదవండి:

విశాఖలో 31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్-2026 ప్రారంభం

ఏపీకి పెట్టుబడుల వరద.. తొలిరోజే రూ.1.57 లక్షల కోట్ల ఒప్పందాలు

Updated Date - Nov 13 , 2026 | 03:54 AM