హైదరాబాద్-విజయవాడ హైవే విస్తరణ పనులు జనవరిలో ప్రారంభం
ABN , Publish Date - Oct 14 , 2026 | 04:51 AM
హైదరాబాద్-విజయవాడ(ఎన్హెచ్-65) రహదారి విస్తరణ పనులను జనవరిలో ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు.
కేంద్ర మంత్రి గడ్కరీ హామీ
శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్
కొత్త డీపీఆర్కు ఆదేశాలు
హైదరాబాద్, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్-విజయవాడ(ఎన్హెచ్-65) రహదారి విస్తరణ పనులను జనవరిలో ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు. అలాగే హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్టు వరకు ప్రతిపాదించిన గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే ప్రతిపాదన పట్ల కూడా సానుకూలంగా స్పందించారు. తెలంగాణలోని మన్ననూరు నుంచి పాతాళగంగ వరకు ప్రతిపాదించిన శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సంబంధించి కొత్త డీపీఆర్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కృష్ణానదిపై సోమశిల దగ్గర ప్రతిపాదించిన ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనుల శంకుస్థాపనకు గడ్కరీ అంగీకారం తెలిపారు. తెలంగాణ మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, జూపల్లి కృష్ణారావుతో మంగళవారం భేటీ సందర్భంగా ఆయన ఆ వివరాలు వెల్లడించారు.
ఈ వార్తలనూ చదవండి:
గిన్నిస్ బుక్లోకి 75 గంటల డప్పుమోత