పాకల తీరంలో గల్లంతైన ఇద్దరు మృతి
ABN , Publish Date - Oct 12 , 2026 | 04:32 AM
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల తీరంలో శనివారం గల్లంతైన మర్కాపురం జిల్లా కనిగిరి మండలం శ్రీరంగాపురానికి చెందిన దేవేండ్ల విష్ణు (17), దేవేండ్ల నారాయణ (25) మృతి చెందారు.
సింగరాయకొండ, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల తీరంలో శనివారం గల్లంతైన మర్కాపురం జిల్లా కనిగిరి మండలం శ్రీరంగాపురానికి చెందిన దేవేండ్ల విష్ణు (17), దేవేండ్ల నారాయణ (25) మృతి చెందారు. మెరైన్ సిబ్బంది, మత్స్యకారులు ఆదివారం గాలింపు కొనసాగించగా విష్ణు మృతదేహాన్ని పాకల వద్ద సముద్రంలో గుర్తించి బోటులో బ యటకు తీసుకొచ్చారు. నారాయణ మృతదేహం పాకల చెల్లమ్మగారి పట్టపుపాలెం తీరానికి కొట్టుకువచ్చింది. అక్కడి మత్స్యకారులు గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు. కాగా.. పాకల బీచ్‌ను సోమవారం నుంచి ఐదు రోజులు తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు తహసీల్దార్ ఓ ప్రకటనలో తెలిపారు. పాకల తీరం నుంచి సముద్రం వైపు ప్రమాదకరమైన నీటి ప్రవాహాలు (రిప్ కరెంట్స్) ఏర్పడే ఆవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి...
నెల్లూరులో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
రాయలసీమ అభివృద్ధి సభలో రాజకీయాలు వద్దు: పవన్ కల్యాణ్