జల్లేరు జలాశయంలో మునిగి ఇద్దరు యువకుల మృతి
ABN , Publish Date - Mar 15 , 2026 | 08:07 PM
ఏలూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బుట్టాయగూడెం మండలం దొరమామిడిలోని జల్లేరు జలాశయంలో మునిగి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు.
ఏలూరు, మార్చి 15: జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బుట్టాయగూడెం మండలం దొరమామిడిలోని జల్లేరు జలాశయంలో మునిగి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. దేవరపల్లి మండలం యాదవోలుకి చెందిన 35 ఏళ్ల తుమ్మల నాగరాజు, 30 ఏళ్ల తుమ్మల రమణ ఈత కొట్టడానికి జల్లేరు జలాశయానికి వెళ్లారు. ఈత కొడుతుండగా ఇద్దరూ నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు జలాశయం నుంచి రెండు శవాలను వెలికి తీశారు.
గతంలోనూ..
గత ఏడాది ఇదే నెలలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన షేక్ అన్వర్, ఫర్విన్ దంపతుల కుమారులు సిద్దిక్ (11), అబ్దుల్ మజీద్ (7) జలాశయంలో దిగి ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ మునిగి చనిపోయారు. పోలీసులకు సమాచారం అందడంతో ఈతగాళ్లతో గాలించారు. చిన్నారుల మృతదేహాలను బయటకు తీశారు.
ఇవి కూడా చదవండి
పుట్టా మహేశ్ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలి: సీపీఎం
రాజకీయాల కోసం డ్రగ్స్ కేసులా? రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్