Share News

ధనుర్మాస దర్శనాల పేరుతో మోసం

ABN , Publish Date - Oct 27 , 2026 | 04:54 AM

భక్తుల అమాయకత్వాన్ని, అవసరాలను ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు వివిధ రకాలుగా మోసం చేస్తూనే ఉన్నారు. కేవలం టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే నమ్మాలని టీటీడీ అధికారులు స్పష్టం చేస్తున్నా భక్తులు నకిలీ వెబ్‌సైట్లను ఆశ్రయించి మోసపోతూనే ఉన్నారు.

ధనుర్మాస దర్శనాల పేరుతో మోసం

  • వాట్సాప్‌ నంబరుతో శ్రీవారి భక్తులకు కుచ్చుటోపీ

తిరుమల, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): భక్తుల అమాయకత్వాన్ని, అవసరాలను ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు వివిధ రకాలుగా మోసం చేస్తూనే ఉన్నారు. కేవలం టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే నమ్మాలని టీటీడీ అధికారులు స్పష్టం చేస్తున్నా భక్తులు నకిలీ వెబ్‌సైట్లను ఆశ్రయించి మోసపోతూనే ఉన్నారు. తాజాగా సైబర్‌ నేరగాళ్లు ఒక వాట్సాప్‌ నంబరును అందుబాటులోకి తీసుకువచ్చి ధనుర్మాసానికి సంబంధించిన టికెట్లు అందుబాటులో ఉన్నాయని, వెంటనే బుక్‌ చేసుకోకుంటే అయిపోతాయని మోసం చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు దర్శన టికెట్ల కోసం నగదు చెల్లిస్తున్నారు.

తీరా సొమ్ము చెల్లించిన తర్వాత ఆ నంబరు నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో మోసపోయామంటూ లబోదిబోమంటున్నారు. 7209003126 మొబైల్‌ నంబరుతో తిరుపతి తిరుమల దేవస్థానం అని చూపిస్తున్న ఈ వాట్సాప్‌ అకౌంట్‌ ద్వారా ధనుర్మాసంలో శ్రీవారి సుప్రభాత సేవ టికెట్లు ఇప్పిస్తామంటూ ప్రచారం చేస్తున్నారు. ఒక్కో టికెట్‌కు రూ.2 వేలు చెల్లించాలని, అదీ కేవలం పది నిమిషాల్లోనే డబ్బులు పంపిస్తే టికెట్లు కన్ఫర్మ్‌ అవుతాయని ఫోన్లు చేస్తున్నట్టు బాధితులు తెలిపారు. ఇలా పలు సేవలకు సంబంధించి భక్తుల నుంచి నగదు వసూలు చేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై బాధితులు ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే టీటీడీ, పోలీసులు చర్యలు తీసుకునే ఆస్కారం ఉంది.

ఈ వార్తలనూ చదవండి:

బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా బలపడిన ‘అర్నబ్’

అతి తీవ్ర తుఫాను..ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

Updated Date - Oct 27 , 2026 | 04:55 AM