ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీ నిలిపివేత
ABN , Publish Date - Oct 13 , 2026 | 05:15 AM
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఈ నెల 20వ తేదీ వరకు ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీని నిలిపివేస్తూ టీటీడీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
తిరుపతి(టీటీడీ), అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఈ నెల 20వ తేదీ వరకు ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీని నిలిపివేస్తూ టీటీడీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకొని టోకెన్ల జారీ నిలిపివేశారు. ఇటీవల సాలకట్ల బ్రహ్మోత్సవాల సమయంలోనూ టీటీడీ అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు భక్తులు నేరుగా తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకోవచ్చు. 21వ తేదీకి సంబంధించిన టోకెన్లను 20వ తేదీన జారీ చేయనున్నారు.
ఈ వార్తలనూ చదవండి: