జీడిపప్పు తిరస్కరణ వాస్తవమే: జీసీసీ
ABN , Publish Date - Oct 06 , 2026 | 05:29 AM
పార్వతీపురం నుంచి తిరుపతికి పంపిన జీడిపప్పును నాణ్యతా ప్రమాణాల పరిశీలన అనంతరం టీటీడీ తిరస్కరించిన విషయం వాస్తవమేనని గిరిజన సహకార కార్పొరేషన్(జీసీసీ) మేనేజింగ్ డైరెక్టర్, వైస్ చైర్మన్ శోభిక తెలిపారు.
పార్వతీపురం, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం నుంచి తిరుపతికి పంపిన జీడిపప్పును నాణ్యతా ప్రమాణాల పరిశీలన అనంతరం టీటీడీ తిరస్కరించిన విషయం వాస్తవమేనని గిరిజన సహకార కార్పొరేషన్(జీసీసీ) మేనేజింగ్ డైరెక్టర్, వైస్ చైర్మన్ శోభిక తెలిపారు. తిరస్కరణకు గురైన జీడిపప్పు స్థానంలో నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా తాజా నిల్వతో భర్తీ చేస్తామని సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల నాలుగో తేదీన ‘12 టన్నుల జీడిపప్పు వెనక్కి’ అన్న శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన సంచికలో ప్రచురించిన కథనంపై జీసీసీ స్పందించింది.
ఈ వార్తలనూ చదవండి:
ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం.. ఉద్యోగుల శిక్షణపై సీఎం స్పెషల్ ఫోకస్
ఏపీలో నాలుగు కొత్త పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం