Share News

టీటీడీకి స్పెసిఫైడ్‌ అథారిటీ

ABN , Publish Date - Nov 03 , 2026 | 05:03 AM

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) కార్యకలాపాలను నిర్వహించే పాలక మండలి పదవీ కాలం అక్టోబరు 31తో ముగిసింది. దీంతో టీటీడీ కార్యకలాపాలకు ఎలాంటి ఇబ్బందులూ రాకుండా స్పెసిఫైడ్‌ అథారిటీ(ప్రత్యేక అధికారులు)ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

టీటీడీకి స్పెసిఫైడ్‌ అథారిటీ

  • చైర్మన్‌గా ఈవో రవిచంద్ర

  • సభ్యులుగా ఇద్దరు ఐఏఎస్‌లు

  • స్థానిక ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో

  • కొత్త పాలక మండలి వాయిదా

తిరుపతి(టీటీడీ), నవంబరు 2(ఆంధ్రజ్యోతి): తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) కార్యకలాపాలను నిర్వహించే పాలక మండలి పదవీ కాలం అక్టోబరు 31తో ముగిసింది. దీంతో టీటీడీ కార్యకలాపాలకు ఎలాంటి ఇబ్బందులూ రాకుండా స్పెసిఫైడ్‌ అథారిటీ(ప్రత్యేక అధికారులు)ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీకి టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రను చైర్మన్‌గా, మరో ఇద్దరు ఐఏఎస్‌ అధికారులు.. ఆర్థికశాఖ కార్యదర్శి వి.వినయ్‌చంద్‌, రెవెన్యూశాఖ(దేవదాయ) కార్యదర్శి కె. కన్నబాబులను సభ్యులుగా నియమించింది. స్పెసిఫైడ్‌ అథారిటీ పదవీ కాలం ఏడాది లేదా కొత్త పాలక మండలి ఏర్పాటయ్యే వరకు ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వాస్తవానికి ఇప్పుడు కొత్త పాలక మండలిని ఏర్పాటు చేసేందుకు అవకాశం లేదు. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంది.

దీంతో ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాకే కొత్త బోర్డును ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌ ఎన్నికలు డిసెంబరు 2న జరగనున్నాయి. దీంతో అప్పటి వరకు ఎన్నికల కోడ్‌ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక అధికారులతో కూడిన స్పెసిఫైడ్‌ అథారిటీని ఏర్పాటు చేశారు. గతంలో కూడా పలుమార్లు పాలక మండలి స్థానంలో ప్రభుత్వాలు స్పెసిఫైడ్‌ అథారిటీని ఏర్పాటు చేశాయి. ఉమ్మడి రాష్ట్రంలో రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2010లో అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జె. సత్యనారాయణ చైర్మన్‌గా ప్రభుత్వం స్పెసిఫైడ్‌ అథారిటీని ఏర్పాటు చేసింది. 2014లో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జేసీ శర్మ చైర్మన్‌గా, 2021లో టీటీడీ ఈవోగా ఉన్న జవహర్‌రెడ్డి చైర్మన్‌గా స్పెసిఫైడ్‌ అథారిటీలను నియమించారు.

ఈ వార్తలనూ చదవండి:

త్వరితగతిన రాష్ట్రానికి సాయం అందించండి.. కేంద్రానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

ఏపీ లిక్కర్ స్కామ్.. ఈడీ కస్టడీలో నిందితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి

Updated Date - Nov 03 , 2026 | 05:06 AM