Share News

ఏకలవ్య పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య

ABN , Publish Date - Sep 18 , 2026 | 06:30 AM

పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం అనసభద్ర ఏకలవ్య పాఠశాలలో ఓ గిరిజన విద్యార్థి గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు.

ఏకలవ్య పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య

మక్కువ, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం అనసభద్ర ఏకలవ్య పాఠశాలలో ఓ గిరిజన విద్యార్థి గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. సీతంపేట మండలం ఎర్రన్నగూడ గ్రామానికి చెంది న సవర రాంబాబు, చామంతి కుమారుడు అర్పిత్‌ (12) ఏడో తరగతి చదువుతూ హాస్టల్‌లో ఉంటున్నాడు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకోకుండా గదిలోకి వెళ్లి, కిటికీకి టవల్‌తో ఊరి వేసుకుని కనిపించాడు. కుమారుడి మృతిపై రాంబాబు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రిన్సిపాల్‌, సిబ్బంది పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని ఆరోపించారు. మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆదేశాల మేరకు ప్రిన్సిపాల్‌ సురేశ్‌ను సస్పెండ్‌ చేసి, వార్డెన్‌ను విధులు నుంచి తొలగిస్తూ గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి నాయక్‌ ఆదేశాలు జారీచేశారు.

ఈ వార్తలనూ చదవండి:

భలే మంచి బేరం !

బీజేపీది ద్వంద్వ వైఖరి: బొత్స

Updated Date - Sep 18 , 2026 | 06:30 AM