Share News

వారాణసీలో ముగిసిన సేవా సంకల్ప్‌ యాత్ర

ABN , Publish Date - Oct 08 , 2026 | 06:12 AM

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పురస్కరించుకుని తెలుగునాడు స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌, తెలుగు యువత సంయుక్తంగా చేపట్టిన తిరుపతి-వారాణసీ బైక్‌ యాత్ర ముగిసింది.

వారాణసీలో ముగిసిన సేవా సంకల్ప్‌ యాత్ర

అమరావతి, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పురస్కరించుకుని తెలుగునాడు స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌, తెలుగు యువత సంయుక్తంగా చేపట్టిన తిరుపతి-వారాణసీ బైక్‌ యాత్ర ముగిసింది. సుమారు 2000ల కిలోమీటర్ల దూరం ప్రయాణించి కాశీ క్షేత్రానికి చేరుకున్న బైకర్లు రవినాయుడు, ప్రవణ్‌ గోపాల్‌ తదితరులకు రాజ్యసభ సభ్యులు సానా సతీశ్‌బాబు, చింతకాయల విజయ్‌ స్వాగతం పలికారు. కాశీకి చేరుకున్న సేవా సంకల్ప్‌ యాత్రపై ప్రధాని మోదీ ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు. ‘సేవా దృక్పథం, సుపరిపాలన సందేశాన్ని చాటుతూ ఏపీలోని తిరుపతి నుంచి కాశీ వరకు సాగించిన బైక్‌ యాత్ర ప్రశంసనీయం. పుణ్య నదులైన కృష్ణా, గోదావరి జలాలను కాశీ క్షేత్రానికి తీసుకువచ్చి సమర్పించిన తీరు నా మనసుకు హత్తుకుంది’ అని ప్రధాని పేర్కొన్నారు.

ఈ వార్తలనూ చదవండి..

రైతన్నకు ఊరటేదీ?

ప్రజల చెంతకు వైద్య సేవలు

Updated Date - Oct 08 , 2026 | 06:12 AM