కన్నులపండువగా శ్రీవారి పుష్పయాగం
ABN , Publish Date - Nov 17 , 2026 | 05:50 AM
కార్తీకమాసం...శ్రవణా నక్షత్రం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం పుష్పయాగం కన్నులపండువగా జరిగింది.
తిరుమల, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): కార్తీకమాసం...శ్రవణా నక్షత్రం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం పుష్పయాగం కన్నులపండువగా జరిగింది. 16 రకాల పుష్పాలు, ఆరు రకాల పత్రాలతో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామికి పుష్పార్చన నిర్వహించారు. స్వామి, అమ్మవార్లను విశేషంగా అలంకరించి మధ్యా హ్నం ఒంటిగంటనుంచి 5 గంటల వరకు వేదమంత్రాల నడుమ పుష్పకైంకర్యం నిర్వహించారు.