Share News

నేటి నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు

ABN , Publish Date - Oct 12 , 2026 | 04:21 AM

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి వైభవంగా ప్రారంభం కానున్నాయి. భక్తులను ఆకట్టుకునేలా తిరుమల క్షేత్రాన్ని విద్యుత్‌, పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.

నేటి నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు

శాస్త్రోక్తంగా అంకురార్పణ

తిరుమల, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి వైభవంగా ప్రారంభం కానున్నాయి. భక్తులను ఆకట్టుకునేలా తిరుమల క్షేత్రాన్ని విద్యుత్‌, పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం రాత్రి అంకురార్పణ కార్యక్రమాన్ని శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఇందులో భాగంగా విష్వక్సేనులవారిని ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. గత నెలలో జరిగిన సాలకట్ల బ్రహ్మోత్సవాల తరహాలో ఈనెల 12 నుంచి 20వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలనూ వైభవంగా నిర్వహించనున్నారు. దసరా సెలవులతోపాటు పెరటాశి మాసం చివరివారం కావడంతో ఈ బ్రహ్మోత్సవానికి భక్తులు భా రీగా వస్తారనే అంచనాతో టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఇక, ఈ తొమ్మిది రోజులపాటు వివిధ వాహనాలపై ఊరేగుతూ భక్తకోటికి దర్శనమిచ్చేందుకు శ్రీవారి వాహనాలను ముస్తాబు చేశారు. తొలి రోజు సోమవారం రాత్రి పెద్దశేష వాహనంపై స్వామివారు విహరిస్తారు.

బ్రహ్మోత్సవాల్లో నేడు

ఉదయం: 9-11 గంటల మధ్య బంగారు తిరుచ్చి

రాత్రి: 7-9 గంటల మధ్య పెద్ద శేష వాహన సేవ

ఈ వార్తలనూ చదవండి...

నెల్లూరులో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు

రాయలసీమ అభివృద్ధి సభలో రాజకీయాలు వద్దు: పవన్ కల్యాణ్

Updated Date - Oct 12 , 2026 | 04:21 AM