Share News

వైభవంగా శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

ABN , Publish Date - Oct 13 , 2026 | 04:43 AM

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం రంగనాయకుల మండపంలో విశేష సమర్పణ అనంతరం మలయప్పకు, దేవేరులకు, అర్చకులు ఏటీ రమేశ్‌ దీక్షితులు, ఈవో రవిచంద్రకు కంకణధారణ చేశారు.

వైభవంగా శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

  • బంగారు తిరుచ్చి, పెద్ద శేష వాహనాలపై మలయప్ప విహారం

తిరుమల, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం రంగనాయకుల మండపంలో విశేష సమర్పణ అనంతరం మలయప్పకు, దేవేరులకు, అర్చకులు ఏటీ రమేశ్‌ దీక్షితులు, ఈవో రవిచంద్రకు కంకణధారణ చేశారు.యాగశాలలో శాస్త్రోక్తంగా కైంకర్యాలు నిర్వహించారు. ఆ తర్వాత బంగారు తిరుచ్చిలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి నాలుగు మాడవీధుల్లో విహరించారు. రాత్రి పెద్ద శేష వాహనంలో ఉత్సవర్లు కొలువుదీరి భక్తులను అనుగ్రహించారు. మంగళవారం ఉదయం 8 గంటలకు చిన్న శేష, రాత్రి 7 గంటలకు హంస వాహన సేవ నిర్వహిస్తారు.

ఈ వార్తలనూ చదవండి:

పెట్టుబడుల స్వర్గధామం ఏపీ

నాడు అడ్డగోలు.. నేడు గగ్గోలు

Updated Date - Oct 13 , 2026 | 04:43 AM