రేపు తిరుమలలో కార్తీక పర్వ దీపోత్సవం
ABN , Publish Date - Nov 23 , 2026 | 05:58 AM
తిరుమలలో మంగళవారం కార్తీక పర్వ దీపోత్సవాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించనుంది.
గరుడ సేవను రద్దు చేసిన టీటీడీ
తిరుమల, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో మంగళవారం కార్తీక పర్వ దీపోత్సవాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించనుంది. కార్తీక పౌర్ణమి రోజున శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనలు పూర్తి చేశాక దీపోత్సవాన్ని నిర్వహిస్తారు. సాయంత్రం ఐదు నుంచి రాత్రి 8.30 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది. కాగా, ప్రతినెలా పౌర్ణమి రోజు నిర్వహించే గరుడసేవను దీపోత్సవం సందర్భంగా టీటీడీ రద్దు చేసింది. నిత్య సహస్ర దీపాలంకార సేవను కూడా రద్దు చేసినట్టు ప్రకటించింది.