Share News

గరుడుడిపై వైకుంఠనాథుడి వైభవం

ABN , Publish Date - Oct 17 , 2026 | 05:47 AM

కలియుగ వైకుంఠం గోవింద నామస్మరణతో మారుమోగింది. చిరుజల్లుల నడుమ కర్పూర హారతులు, మంగళవాయిద్యాలు, వేదమంత్రాలు, కళాకారులు ప్రదర్శనల మధ్య వరుణుడు తోడుగా..

గరుడుడిపై వైకుంఠనాథుడి వైభవం

  • ఇష్ట వాహనంపై దర్శనమిచ్చిన శ్రీవారు

తిరుమల, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): కలియుగ వైకుంఠం గోవింద నామస్మరణతో మారుమోగింది. చిరుజల్లుల నడుమ కర్పూర హారతులు, మంగళవాయిద్యాలు, వేదమంత్రాలు, కళాకారులు ప్రదర్శనల మధ్య వరుణుడు తోడుగా శ్రీవేంకటేశ్వరస్వామి తన ఇష్ట వాహనమైన గరుత్మంతుడిపై కొలువుదీరి భక్తులను కటాక్షించాడు. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదవరోజు శుక్రవారం రాత్రి గరుడోత్సవం వైభవోపేతంగా జరిగింది. మలయప్పస్వామి విశేష అలంకరణతో గరుడ వాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ దర్శనమిచ్చారు. సాయంత్రం 6.28గంటలకు వాహన మండపం తెరతీయగానే ఒక్కసారిగా మాడవీధులు గోవింద నామస్మరణతో మారుమోగాయి. కాగా.. ఉదయం మోహినీ అవతారం కన్నులపండువగా జరిగింది. తిరుచ్చిపై శ్రీకృష్ణస్వామి తోడురాగా మలయప్పస్వామి మోహినీ అవతారంలో సర్వాలంకార భూషితుడై భక్తులకు జగన్మోహనాలంకారంలో దర్శనమిచ్చారు.

ఈ వార్తలనూ చదవండి:

అంతా కొలిక్కి...

ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు

Updated Date - Oct 17 , 2026 | 05:47 AM