Share News

పట్టిసీమలో పెద్దపులి మళ్లీ వచ్చింది!

ABN , Publish Date - Oct 08 , 2026 | 05:43 AM

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల వాసులను భయభ్రాంతులకు గురిచేస్తూ, అటవీ అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్న పెద్దపులి మంగళవారం రాత్రి ఏలూరు జిల్లా పోలవరం మండలం పట్టిసీమ-కొత్తపట్టిసీమ గ్రామాల మధ్య మళ్లీ కనిపించింది.

పట్టిసీమలో పెద్దపులి మళ్లీ వచ్చింది!

పోలవరం, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల వాసులను భయభ్రాంతులకు గురిచేస్తూ, అటవీ అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్న పెద్దపులి మంగళవారం రాత్రి ఏలూరు జిల్లా పోలవరం మండలం పట్టిసీమ-కొత్తపట్టిసీమ గ్రామాల మధ్య మళ్లీ కనిపించింది. దీంతో పట్టిసీమ, కొత్తపట్టిసీమ, గూటాల, మహాలక్ష్మీదేవిపేట ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత నెలలో కుక్కునూరు, వేలేరుపాడు ప్రాంతం నుంచి పాపికొండలు అభయారణ్యంలోకి వెళ్లిన పెద్దపులి.. పోలవరం మండలం శివగిరి ముంపు ప్రాంత ప్రజల్ని ఆందోళనకు గురిచేసింది. తర్వాత చేగొండపల్లి, మెత్తప్పకోట, ఉడతపల్లి ప్రాంతాల్లో సంచరించడంతో దానిని పట్టుకోడానికి అటవీ అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.

మంగళవారం రాత్రి పట్టిసీమ, కొత్తపట్టిసీమ గ్రామాల మధ్య గోదావరి నది దాటినట్లు పాదముద్రల ద్వారా, పులి మెడకు అమర్చిన శాటిలైట్‌ రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్‌ ద్వారా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తుపాకులగూడెం, రాగోలపల్లి, సగ్గొండ ప్రాంతాల్లో పెద్దపులి సంచరించి బయ్యారం అడవులకు వెళ్లినట్టు అటవీ క్షేత్రాధికారి ఎస్‌కే వలీ తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి..

రైతన్నకు ఊరటేదీ?

ప్రజల చెంతకు వైద్య సేవలు

Updated Date - Oct 08 , 2026 | 05:43 AM