ఏలూరు జిల్లాలో పెద్దపులి సంచారం.. ప్రజలకు అధికారుల హెచ్చరిక..
ABN , Publish Date - Apr 12 , 2026 | 05:33 PM
పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలు కొత్తూరు, వాడపల్లి పరిసరాలలో పెద్దపులి సంచరిస్తోంది. ఆ పెద్దపులి అల్లూరి జిల్లా మాంటూరు నుంచి గోదావరి నది దాటి ఏలూరు జిల్లాలోకి తిరిగి ప్రవేశించింది.
ఇంటర్‌నెట్ డెస్క్: ఏలూరు జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలు కొత్తూరు, వాడపల్లి పరిసరాలలో పెద్దపులి సంచరిస్తోంది. ఆ పెద్దపులి అల్లూరి జిల్లా మాంటూరు నుంచి గోదావరి నది దాటి ఏలూరు జిల్లాలోకి తిరిగి ప్రవేశించింది. అటవీ శాఖ అధికారులు వీడియో ట్రాకర్ సాయంతో నిరంతరం పెద్దపులి కదలికలను పర్యవేక్షిస్తున్నారు. పెద్దపులి సంచారం నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రజలకు పలు హెచ్చరికలు జారీ చేశారు. ముందు జాగ్రత్తగా రాత్రి వేళల్లో ఒంటరిగా తిరగవద్దని హెచ్చరించారు.
ఊపిరి పీల్చుకున్న మన్యం వాసులు..
పెద్దపులి నది దాటటంతో రెండు వారాలుగా కంటి మీద కునుకులేకుండా అల్లాడిపోయిన మన్యం వాసులు ఊపిరి పీల్చుకున్నారు. మూడు రోజుల పాటు దేవీపట్నం, లింగవరం పరిసర ప్రాంతాల్లో పులి తిరిగింది. శనివారం ఉదయం దేవీపట్నం, అగ్రహారం పరిసర ప్రాంతాల్లో గోదావరిని దాటుకుని ఏలూరు జిల్లా పోలవరం మండలం సింగనపల్లికి చేరుకుంది. అది పోలవరం ప్రాజెక్ట్ ముంపు ప్రాంతం కావటంతో నిర్వాసితులు గ్రామాన్ని ఖాళీ చేసి పునరావాస కాలనీలకు వెళ్లిపోయారు.
ఇవి కూడా చదవండి
ఐపీఎల్ 2026: చెలరేగిన ప్రసిద్ధ్.. గుజరాత్ టైటాన్స్ టార్గెట్ 165
ఆ విషయంలో ముంబై ఇండియన్స్ తుస్సు: అశ్విన్