లేగదూడపై పెద్ద పులి దాడి.. మాతంగమ్మమెట్టపై మకాం
ABN , Publish Date - Oct 13 , 2026 | 05:11 AM
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి శివారులో ఆదివారం రాత్రి లేగదూడపై పులి దాడిచేసి చంపేసింది.
గోపాలపురం, దేవరపల్లి, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి శివారులో ఆదివారం రాత్రి లేగదూడపై పులి దాడిచేసి చంపేసింది. కొన్నిరోజుల క్రిందట గోదావరి దాటి తాళ్లపూడి మండలం తుపాకులగూడెం, సూరయ్యపేట గ్రామాల సమీపానికి చేరుకున్న పులి అక్కడ నుంచి భీమోలు మీదుగా దేవరపల్లి మండలం గౌరీపట్నంలోని మేరీమాత ఆలయం వెనుక ఉన్న క్వారీలో మకాం వేసింది. అక్కడ నుంచి డెల్టా ప్రాంతం చేరుకుని వెనుతిరిగి గౌరీపట్నం క్వారీల మీదుగా పోలవరం కుడికాల్వ గట్టు పై చేరింది. సోమవారం తెల్లవారుజామున మాతంగమ్మమెట్ట చేరుకుంది. పులిని బంధించేందుకు 80మందితో రెస్క్యూ టీమ్ ప్రయత్నిస్తోంది.
ఈ వార్తలనూ చదవండి: