మూగజీవిపై అమానుషం!
ABN , Publish Date - Nov 03 , 2026 | 06:45 AM
సభ్య సమాజం తలదించుకోవాల్సిన.. మాటలకందని అత్యంత హేయమైన చర్య ఇది. ఓ మూగజీవంపై ముగ్గురు వ్యక్తులు అత్యంత క్రూరంగా ప్రవర్తించి హతమార్చిన ఘటన ఇది..
ఆవుపై లైంగిక దాడి.. ఆపై హత్య.. ముగ్గురు వ్యక్తుల హేయమైన చర్య
కోనసీమ తిరుమల వాడపల్లిలో ఘటన
దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన గ్రామస్థులు
ఆత్రేయపురం నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): సభ్య సమాజం తలదించుకోవాల్సిన.. మాటలకందని అత్యంత హేయమైన చర్య ఇది. ఓ మూగజీవంపై ముగ్గురు వ్యక్తులు అత్యంత క్రూరంగా ప్రవర్తించి హతమార్చిన ఘటన ఇది.. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లిలో సోమవారం ఈ దారుణం జరిగింది. గంధం కేశవరావుకు చెందిన మకాం(పొలాల్లోని పాక)లో ఉన్న ఆవుపై ఆలమూరు మండలం నర్సిపూడికి చెందిన చేమకూర వెంకటరమణ, అమలాపురం రూరల్ మండలం బండార్లంకకు చెందిన అల్లవరపు శ్రీను వెంకన్న, కొత్తపేటకు చెందిన పల్లంరాజు ఈ నీచానికి పాల్పడ్డారు. తొలుత గోమాతపై అత్యాచారం చేసి.. యోని మార్గంలో గెడకర్రతో పొడిచి హతమార్చారు. మూగజీవి పట్ల క్రూరత్వానికి పాల్పడిన ఈ ముగ్గురినీ గ్రామస్థులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. అయితే ఇద్దరు నిందితులను పోలీసులకు అప్పగించగా పల్లంరాజు. తప్పించుకుని పరారయ్యాడు. రైతు ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఎస్.రాము కేసు నమోదు చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
త్వరితగతిన రాష్ట్రానికి సాయం అందించండి.. కేంద్రానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
ఏపీ లిక్కర్ స్కామ్.. ఈడీ కస్టడీలో నిందితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి