Share News

జేసీ వర్సెస్‌ పెద్దారెడ్డి

ABN , Publish Date - Oct 27 , 2026 | 05:57 AM

స్థానిక ఎన్నికల నేపథ్యంలో అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి మాజీ ఎమ్మెల్యేలు జేసీ ప్రభాకర్‌రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గీయులు పరస్పరం దాడులు చేసుకుంటున్నారు.

 జేసీ వర్సెస్‌ పెద్దారెడ్డి

  • ఇరు వర్గీయుల దాడులు

  • పోలీసు స్టేషన్‌ ఎదుట అర్ధరాత్రి ప్రభాకర్‌రెడ్డి నిరసన

తాడిపత్రి, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికల నేపథ్యంలో అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి మాజీ ఎమ్మెల్యేలు జేసీ ప్రభాకర్‌రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గీయులు పరస్పరం దాడులు చేసుకుంటున్నారు. పెద్దారెడ్డి స్వగ్రామం యల్లనూరులో టీడీపీ శ్రేణులపై వైసీపీ శ్రేణులు ఆదివారం దాడి చేశాయి. దీంతో తాడిపత్రిలో జేసీ వర్గీయులు వైసీపీ కార్యకర్తలపై అదేరోజు ప్రతిదాడులు చేశారు. యల్లనూరు మండలం కొడవండ్లపల్లికి చెందిన టీడీపీ నేత జయరామకృష్ణ వాహనాన్ని వైసీపీ స్థానిక నాయకులు ఆదివారం రాత్రి ధ్వంసం చేశారు. ఈ ఘటనను జేసీ ప్రభాకర్‌ రెడ్డి తీవ్రంగా పరిగణించారు.

వైసీపీ వర్గీయులు దాడులకు పాల్పడుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తన అనుచరులు, పార్టీ శ్రేణులతో కలిసి తాడిపత్రి రూరల్‌ పోలీసు స్టేషన్‌ ఎదుట ఆదివారం అర్ధరాత్రి నిరసనకు దిగారు. పోలీసు స్టేషన్‌ ప్రధాన గేటు ముందు మంచం వేసుకుని పడుకున్నారు. పోలీసులు ఆయనతో మాట్లాడి, సర్దిచెప్పి నిరసనను విరమింపజేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే తాడిపత్రి లోని పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తల ఇళ్లపై జేసీ వర్గీయులు దాడులు చేశారు. గన్నెవారిపల్లి కాలనీలో వైసీపీ నేత ప్రదీప్‌కుమార్‌పై దాడి జరిగింది. ఆయన ఇంట్లోని సామగ్రిని ధ్వంసం చేశారు. మాజీ జడ్పీటీసీ రమణమ్మ రామశేఖర్‌, జేసీ సూర్యనారాయణ అలియాస్‌ వంగనూరు సూరి ఇంటిపై దాడిచేశారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేశ్‌రెడ్డి వాహనాలను కూడా ధ్వంసం చేశారు.

ఈ వార్తలనూ చదవండి:

బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా బలపడిన ‘అర్నబ్’

అతి తీవ్ర తుఫాను..ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

Updated Date - Oct 27 , 2026 | 05:57 AM