గొడ్డలి పార్టీ దిగజారుడు రాజకీయం: పల్లా
ABN , Publish Date - Sep 23 , 2026 | 05:46 AM
గురువులపై దాడి అత్యంత హేయమైన చర్య అని పలువురు నేతలు, ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడారు. ‘భావితరాలను తీర్చిదిద్దే ఉపాధ్యాయులపై వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడటం అత్యంత దుర్మార్గం.
గూండాగిరి చేసి నిస్సిగ్గుగా గవర్నర్‌ను కలుస్తారా?: సోమిరెడ్డి
అమరావతి, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): గురువులపై దాడి అత్యంత హేయమైన చర్య అని పలువురు నేతలు, ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడారు. ‘భావితరాలను తీర్చిదిద్దే ఉపాధ్యాయులపై వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడటం అత్యంత దుర్మార్గం. ఉపాధ్యాయులంటే గౌరవం లేని గొడ్డలి పార్టీ నేతలు, కష్టపడి ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులను అవమానించేలా ప్రవర్తించడం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. గురువులపై దాడి చేసిన వారిని చట్ట ప్రకారం గుర్తించి చర్యలు తీసుకోవాలి’ అని పల్లా స్పష్టం చేశారు. ఒంగోలులో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... ‘గురువులపై వైసీపీ గూండాల దాడులు దారుణమైన, హేయమైన చర్య. రాజకీయ పార్టీ ముసుగులో ఒక క్రిమినల్ డీఎస్సీపై ఆరోపణలు, గతంలో భూదోపిడీ, మైనింగ్ కేసుల్లో ఉన్నవారు రోడ్డెక్కి టీచర్లపై దాడులు చేయడం ఏమిటి? దాడి చేసిన వారిని వదిలేది లేదు’ అని హెచ్చరించారు. తమ గోడు చెప్పుకొనేందుకు వచ్చిన ఉపాధ్యాయులపై దాడి చేయడమే కాకుండా నిసిగ్గుగా గవర్నర్‌ను కలసి ఎదురు ఫిర్యాదు చేస్తామని చెప్పడం వైసీపీ దిగజారుడుకి నిదర్శనమని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. గురువుల మీద దాడి చేశారంటే దానిని సమాజంపైనే దాడిగానే పరిగణించాలని మంత్రి కొలుసు పార్థసారథి బాపట్లలో అన్నారు. ఇందులో రౌడీషీటర్లు, గతంలో టీడీపీ కార్యాలయంతో పాటు చంద్రబాబు ఇంటిపై దాడిచేసిన మూకలు తప్ప ఒక్కరంటే ఒక్కరు కూడా డీఎస్సీ పరీక్ష రాసిన అభ్యర్థి లేరని చెప్పారు. ‘జగన్‌రెడ్డి బతుకు ఫేక్, వైసీపీ ఫేక్, చెప్పే ప్రతి మాటా ఫేక్. డీఎస్సీ ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులను కూడా ఫేక్ అనడం దారుణం. టీచర్ల మనోభావాలతో ఆడుకునే గొడ్డలి పార్టీ గూండాలకు గుణపాఠం తప్పదు’ అని మచిలీపట్నంలో హెచ్చరించారు.
ఈ వార్తలనూ చదవండి...
పాదగయలో విషాదం.. పుష్కరిణిలో స్నానానికి దిగి యువకుడి గల్లంతు..
సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం