బీసీలకు వైసీపీ క్షమాపణ చెప్పాలి: ఎంపీ కలిశెట్టి
ABN , Publish Date - Oct 09 , 2026 | 04:39 AM
గత ఐదేళ్ల జగన్ పాలనలో ఉత్తరాంధ్రను, బీసీ వర్గాలను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని టీడీపీ విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ధ్వజమెత్తారు.
న్యూఢిల్లీ, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): గత ఐదేళ్ల జగన్ పాలనలో ఉత్తరాంధ్రను, బీసీ వర్గాలను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని టీడీపీ విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ధ్వజమెత్తారు. గురువారం, ఏపీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఉత్తరాంధ్రలో బీసీ సదస్సు నిర్వహించబోతున్నామంటూ వైసీపీ నేతలు ప్రకటనలు చేయడం హాస్యాస్పదంగా ఉంది. బీసీ సదస్సు నిర్వహించే ముందు గత ఐదేళ్ల పాలనలో ఉత్తరాంధ్ర బీసీలకు చేసిన ద్రోహం, అన్యాయంపై ఆ వర్గాలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఆ సదస్సుకు ‘ఉత్తరాంధ్ర బీసీలకు క్షమాపణ సభ’ అని పేరు పెట్టుకుంటే బాగుంటుంది’’ అని ఎద్దేవా చేశారు. వైసీపీలో ఉన్న ఉత్తరాంధ్ర బీసీ నేతలనుద్దేశించి... ‘‘గతంలో మీ ఆత్మగౌరవాన్ని జగన్ వద్ద తాకట్టు పెట్టి, ఇప్పుడు మళ్లీ బీసీల గురించి మాట్లాడటం సిగ్గుచేటు’’ అన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. చర్చించిన కీలక అంశాలివే..
డిజిటల్ కరెన్సీని మోదీ ప్రోత్సహించారు