గెలవలేమనే నిరాశతోనే వైసీపీ విధ్వంసం: వర్ల
ABN , Publish Date - Oct 17 , 2026 | 04:48 AM
స్థానిక ఎన్నికల్లో ఎక్కడా గెలవలేమన్న నిరాశ నిస్పృహలతో రాష్ట్రంలో జగన్, పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డి పథకం ప్రకారమే గొడవలు సృష్టించేందుకు కుట్రలు చేశారని టీడీపీ ఎమ్మెల్సీ వర్ల రామయ్య ఆరోపించారు.
అమరావతి, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికల్లో ఎక్కడా గెలవలేమన్న నిరాశ నిస్పృహలతో రాష్ట్రంలో జగన్, పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డి పథకం ప్రకారమే గొడవలు సృష్టించేందుకు కుట్రలు చేశారని టీడీపీ ఎమ్మెల్సీ వర్ల రామయ్య ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నావినేషన్లు ప్రారంభమైన తొలి రోజే రాయలసీమలోని వివిధ ప్రాంతాల్లో స్థానిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న వివిధ ఘటనలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి శుక్రవారం ఫిర్యాదు చేశారు.
పుంగనూరు ఘటనపై ఎస్ఈసీ చర్యలు తీసుకోవాలి: పల్లా
‘పుంగనూరు ఘటనలో వైసీపీ ఎంపీ మిథున్పై వచ్చిన ఆరోపణలను రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియ్సగా తీసుకోవాలి. సమగ్ర విచారణ జరిపి బాధ్యుతలపై చర్యలు తీసుకోవాలి’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఓ ప్రకటనలో కోరారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించి, ప్రజలను భయబ్రాంతులకు గురి చేసి ఎన్నికల్లో గెలవాలనే వైసీపీ కుట్రలకు అడ్డుకట్ట వేయాలని ఎస్ఈసీ అధికారులను కోరారు.
ఈ వార్తలనూ చదవండి:
ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు