బెంగళూరులో కూర్చొని జగన్ కుట్ర: ధూళిపాళ్ల
ABN , Publish Date - Oct 17 , 2026 | 04:50 AM
బెంగళూరులో కూర్చుని ఏపీలో విధ్వంస రచనకు గొడ్డలి పార్టీ నేత జగన్ కుట్రలు పన్నుతున్నారని ఎమ్మె ల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు.
అమరావతి, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): బెంగళూరులో కూర్చుని ఏపీలో విధ్వంస రచనకు గొడ్డలి పార్టీ నేత జగన్ కుట్రలు పన్నుతున్నారని ఎమ్మె ల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. శుక్రవారం టీడీపీ కేంద్ర కార్యాలయం లో మాట్లాడారు. ‘మాచర్ల మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ నేతలు బొండా ఉమ, బుద్దా వెంకన్నపై వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి అనుచరులు దాడులు చేసిన దృశ్యాలు ఇప్పటికీ కళ్లముందే ఉన్నాయి పుంగనూరు విధ్వంసానికి పూర్తిబాధ్యత జగన్దే.’ అని నరేంద్ర ఆరోపించారు.
ఈ వార్తలనూ చదవండి:
ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు