Share News

పెద్దిరెడ్డి అరాచకాలపై ప్రజలు తిరగబడుతున్నారు: మాల్యాద్రిపెద్దిరెడ్డి అరాచకాలపై ప్రజలు తిరగబడుతున్నారు: మాల్యాద్రి

ABN , Publish Date - Oct 17 , 2026 | 04:54 AM

పుంగనూరులో శాంతియుతం గా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే తాము గెలవలేమని, కనీసం బోణీ కూడా చేయలేమని ...

పెద్దిరెడ్డి అరాచకాలపై ప్రజలు తిరగబడుతున్నారు: మాల్యాద్రిపెద్దిరెడ్డి అరాచకాలపై ప్రజలు తిరగబడుతున్నారు: మాల్యాద్రి

అమరావతి, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): పుంగనూరులో శాంతియుతం గా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే తాము గెలవలేమని, కనీసం బోణీ కూడా చేయలేమని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బాగా తెలుసు. అందుకే విధ్వంసానికి దిగారు’ అని టీడీపీ నేత గురజాల మాల్యాద్రి అన్నారు. ‘స్థానిక ఎన్నికల్లో వైసీపీని ప్రజలు చావుదెబ్బ కొట్టడం ఖాయం. ఈ విషయాన్ని గుర్తించిన జగన్‌ ఎన్నికలను ఎలాగైనా అడ్డుకోవాలని అనేక కేసులు కోర్టుల్లో వేయించారు. ఆ కుట్రలన్నీ వీగిపోవడంతో ఇప్పుడు విధ్వంసాన్ని మార్గంగా ఎంచుకున్నారు’ అని తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

అంతా కొలిక్కి...

ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు

Updated Date - Oct 17 , 2026 | 04:59 AM