ఈడీ పిటిషన్తో జగన్ వెన్నులో వణుకు: రాజేశ్
ABN , Publish Date - Oct 14 , 2026 | 06:03 AM
అవినీతి కేసుల విచారణ నుంచి తప్పించుకునేందుకు డిశ్చార్జి పిటిషన్లతో కాలయాపన చేస్తున్న జగన్ రెడ్డి, రోజువారీ విచారణ అనగానే ఉలిక్కిపడుతున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అప్పసాని రాజేశ్ అన్నారు.
అమరావతి, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): అవినీతి కేసుల విచారణ నుంచి తప్పించుకునేందుకు డిశ్చార్జి పిటిషన్లతో కాలయాపన చేస్తున్న జగన్ రెడ్డి, రోజువారీ విచారణ అనగానే ఉలిక్కిపడుతున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అప్పసాని రాజేశ్ అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మాట్లాడారు. జగన్ కేసులను రోజువారీ విచారణ చేయాలంటూ కోర్టులో ఈడీ పిటిషన్ వేయగానే జగన్ వెన్నులో వణుకు మొదలైందని, ఈడీని టీడీపీ ఉసిగొల్పుతున్నదంటూ తన పత్రికలో కథనాలు రాయించుకుంటున్నారని విమర్శించారు.
ఈ వార్తలనూ చదవండి:
గిన్నిస్ బుక్లోకి 75 గంటల డప్పుమోత