టీసీఐఎల్కు ఫైబర్‌నెట్ సేవల టెండర్
ABN , Publish Date - Oct 17 , 2026 | 05:21 AM
భారత్‌నెట్ మూడో దశ కింద రాష్ట్రంలో ఫైబర్ నెట్ సేవలందించే టెండర్‌ను ప్రభుత్వ రంగ సంస్థ టెలికమ్యూనికేషన్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (టీసీఐఎల్) దక్కించుకుంది.
2,400 కోట్లతో పదేళ్లపాటు గ్రామాలకు ఇంటర్నెట్ సేవలు
అమరావతి, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): భారత్‌నెట్ మూడో దశ కింద రాష్ట్రంలో ఫైబర్ నెట్ సేవలందించే టెండర్‌ను ప్రభుత్వ రంగ సంస్థ టెలికమ్యూనికేషన్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (టీసీఐఎల్) దక్కించుకుంది. శుక్రవారం తెరచిన టెండర్లలో టీసీఐఎల్ ఎల్-1గా నిలిచింది. రానున్న పదేళ్లలో రూ.2,400 కోట్లతో రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలన్నింటికీ ఫైబర్‌నెట్ సేవలందిస్తామని టీసీఐఎల్ కోట్‌చేసి ఈ టెండర్‌ను దక్కించుకుంది. 2014లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం.. గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వీలుగా ఏపీ ఫైబర్‌నెట్ సంస్థను స్థాపించింది.
కేంద్రం ప్రవేశపెట్టిన భారత్ నెట్-1 కింద 1,692 గ్రామపంచాయతీల్లో 6,000 కి.మీ. మేర ఫైబర్ లైన్‌ను వేసింది. తర్వాత.. మరో 11,254 గ్రామ పంచాయతీల్లో 54,600కి.మీ. మేర ఓపెన్ యాక్సెస్ విధానంలో విద్యుత్ స్తంభాలను ఆధారంగా చేసుకుని ఫైబర్ లైన్లు వేసింది. భారత్‌నెట్ పథకం మార్గదర్శకాల మేరకు భూగర్భంలోనే ఫైబర్‌నెట్ వైర్లను అమర్చాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఓపెన్ యాక్సె్‌సలో ఏర్పాటుచేసిన ఫైబర్‌లైన్ విధానంపై కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ప్రభుత్వం ఇచ్చిన సంజాయిషీ అనంతరం కేంద్రం అనుమతివ్వడంతో.. ఓపెన్ యాక్సెస్ విధానంలోనే ముందుకెళ్లాలని టీసీఐఎల్ నిర్ణయించింది.
ఈ వార్తలనూ చదవండి:
ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు