Share News

విజయవంతంగా స్వచ్ఛథాన్‌-2026

ABN , Publish Date - Oct 03 , 2026 | 05:45 AM

పరిశుభ్రత, ఫిట్‌నెస్‌, బాధ్యతాయుత పౌరసత్వంపై అవగాహన కల్పించేందుకు విజయవాడలో నిర్వహించిన ‘స్వచ్ఛథాన్‌-2026’కు విశేష స్పందన వచ్చింది.

 విజయవంతంగా స్వచ్ఛథాన్‌-2026

  • మారథాన్‌లో 23 రాష్ట్రాల నుంచి 10 వేల మంది

విజయవాడ, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): పరిశుభ్రత, ఫిట్‌నెస్‌, బాధ్యతాయుత పౌరసత్వంపై అవగాహన కల్పించేందుకు విజయవాడలో నిర్వహించిన ‘స్వచ్ఛథాన్‌-2026’కు విశేష స్పందన వచ్చింది. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌, అమరావతి రన్నర్స్‌ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఈ రన్‌లో 23 రాష్ట్రాల నుంచి 10 వేల మందికిపైగా పాల్గొన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం నుంచి ప్రారంభమైన రన్‌ ఎంజీరోడ్డు, ప్రకాశం బ్యారేజీ, అమరావతి సీడ్‌ యాక్సిస్‌ రోడ్డుతో పాటు పలు ప్రాంతాల మీదగా సాగింది. మారథాన్‌లో ఆయా విభాగాల్లో విజయం సాధించిన వారికి రూ.10 లక్షల నగదు బహుమతులు అందజేశారు. కార్యక్రమాన్ని ఎంపీ కేశినేని శివనాథ్‌, కార్పొరేషన్‌ చైర్మన్‌ పట్టాభి ప్రారంభించగా.. విజయవాడ సీపీ రాజశేఖరబాబు, మున్సిపల్‌ కమిషనర్‌ ధ్యానచంద్‌ పాల్గొన్నారు.

ఈ వార్తలనూ చదవండి..

స్వచ్ఛతే ఆరోగ్యానికి తొలిమెట్టు

శ్రీవారి ఆలయానికి ‘స్వచ్ఛ’ అవార్డు

Updated Date - Oct 03 , 2026 | 05:45 AM