పీజీ మెడికల్ సీట్ల భర్తీ కౌన్సెలింగ్ పొడిగింపుపై సుప్రీంకోర్టులో విచారణ..
ABN , Publish Date - Mar 23 , 2026 | 05:01 PM
తెలుగు రాష్ట్రాల్లో పీజీ మెడికల్ సీట్ల భర్తీ కౌన్సెలింగ్ పొడిగింపుపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో కౌన్సెలింగ్ పొడిగింపునకు సంబంధించి అనుమతి ఇవ్వకపోవడంపై వివరణ ఇవ్వాలని మెడికల్ కమిషన్‌కు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో పీజీ మెడికల్ సీట్ల భర్తీ కౌన్సెలింగ్ పొడిగింపుపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో కౌన్సెలింగ్ పొడిగింపునకు సంబంధించి అనుమతి ఇవ్వకపోవడంపై వివరణ ఇవ్వాలని మెడికల్ కమిషన్‌కు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు పీజీ కోర్సుల్లో చేరేందుకు సిద్దంగా ఉన్నారని, సీట్లు వృథా కాకుండా చూడాలని సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. సీట్ల భర్తీ కౌన్సెలింగ్ పొడిగింపు అంశంపై విచారణను మంగళవారానికి వాయిదా వేసింది (PG medical counselling extension).
తెలుగు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న మెడికల్ పీజీ సీట్ల భర్తీ వ్యవహారంపై వైద్య విద్య కళాశాల యాజమాన్యాలు ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఫిబ్రవరి 28వ తేదీతో కౌన్సెలింగ్ ముగిసిందని, అయితే ఆ తేదీకి ఆంధ్రప్రదేశ్‌లో 246 సీట్లు, తెలంగాణలో 377 పీజీ సీట్లు భర్తీ కాలేదని న్యాయస్థానం దృష్టికి కాలేజీ యాజమాన్యాలు తీసుకువచ్చాయి. వీటిలో ఏపీలో సుమారు 45 కన్వీనర్ కోటా సీట్లు కూడా ఉన్నాయని జస్టిస్ పీఎస్ నర్సింహ, జస్టిస్ అలోక్ అరాథే ధర్మాసనం దృష్టికి యాజమాన్యాల తరపు న్యాయవాదులు తీసుకువచ్చారు (Supreme Court hearing PG seats).
కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులు సిద్ధంగా ఉన్నారని, కానీ గడువు ముగియడంతో కౌన్సెలింగ్ ముగించారని యాజమాన్యాలు ప్రస్తావించాయి (NEET PG counselling news). గడువు పెంచాలని ఫిబ్రవరి 28వ తేదీకి ముందే జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ)కి సంబంధిత యూనివర్సిటీలు, కాలేజీలు విజ్ఞప్తి చేశాయి. యాజమాన్యాలు విజ్ఞప్తి చేసినా ఎన్‌ఎంసీ నుంచి ఎలాంటి సమాధానమూ రాలేదని కోర్టుకు న్యాయవాదులు చెప్పారు.
ఇవి కూడా చదవండి..
క్షిపణిపై శాంతి సందేశం.. ఇజ్రాయెల్ పైకి ప్రయోగించిన ఇరాన్..
మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ పులుల మధ్యనున్న జీబ్రాను 10 సెకెన్లలో కనిపెట్టండి..