Share News

వ్యక్తుల కోసం ప్రజా ప్రయోజన వ్యాజ్యాలా?

ABN , Publish Date - Sep 29 , 2026 | 06:17 AM

ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్‌) ముసుగులో వ్యక్తుల ను లక్ష్యంగా చేసుకుని దాఖలు చేసే పిటిషన్లపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యాజ్యాలతో ఎవరు లబ్ధి పొందాలని అనుకుంటున్నారో తెలుస్తోందని వ్యాఖ్యానించింది.

వ్యక్తుల కోసం ప్రజా ప్రయోజన వ్యాజ్యాలా?

ఏపీ హైకోర్టు జరిమానా సబబే: సుప్రీం

న్యూఢిల్లీ, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్‌) ముసుగులో వ్యక్తుల ను లక్ష్యంగా చేసుకుని దాఖలు చేసే పిటిషన్లపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యాజ్యాలతో ఎవరు లబ్ధి పొందాలని అనుకుంటున్నారో తెలుస్తోందని వ్యాఖ్యానించింది. ఈ తరహా కేసులో ఏపీ హైకోర్టు విధించిన రూ.50 వేల జరిమానాను సమర్థించింది. ఏపీ ప్రభుత్వంతోపాటు ఇతరులను ప్రతివాదులుగా చేస్తూ డి. ఉదయ్‌కుమార్‌ అనే వ్యక్తి హైకోర్టులో ఓ పిల్‌ దాఖలు చేశారు. అయితే, అది ఉద్దేశపూర్వకంగానే ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని వేశారని హైకోర్టు భావించింది. పిటిషనర్‌కు రూ.50 వేల జరిమానా విధించింది. దీనిని ఎత్తివేయాలని కోరుతూ పిటిషనర్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సోమవారం ఈ పిటిషన్‌పై సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది. అనవసర వ్యాజ్యాలు వేసినప్పుడు జరిమానాలు విధించే స్వేచ్ఛ హైకోర్టులకు ఉంటుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. విచారణను ముగించింది.

ఈ వార్తలనూ చదవండి...

పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. అక్టోబర్‌ 1న ఉదయం 6:30 నుంచే పింఛన్ల పంపిణీ

పీఎం కిసాన్ 24వ విడత.. రైతులు ఈ 3 పనులు పూర్తి చేయాల్సిందే..

Updated Date - Sep 29 , 2026 | 06:17 AM