Share News

బ్యాంకు రుణాల దారి మళ్లింపు కేసులో జోక్యం చేసుకోలేం

ABN , Publish Date - Oct 27 , 2026 | 05:39 AM

బ్యాంకు రుణాల దారి మళ్లింపు వ్యవహారంలో ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామ కృష్ణంరాజు సహా ఇతరులకు సుప్రీం కోర్టులో నిరాశ ఎదురైంది

బ్యాంకు రుణాల దారి మళ్లింపు కేసులో జోక్యం చేసుకోలేం

సుప్రీంలో రఘురామరాజు క్వాష్‌ పిటిషన్‌ కొట్టివేత

న్యూఢిల్లీ, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): బ్యాంకు రుణాల దారి మళ్లింపు వ్యవహారంలో ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామ కృష్ణంరాజు సహా ఇతరులకు సుప్రీం కోర్టులో నిరాశ ఎదురైంది. ఈ అంశంలో జోక్యం చేసుకోవడానికి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. దర్యాప్తు అధికారి 16 వారాల్లోగా విచారణ పూర్తిచేసి చార్జిషీట్‌ దాఖలు చేయాలని ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలున్న నేపథ్యంలో.. ఈ అంశంలో కలుగజేసుకోలేమని తేల్చిచెప్పింది. రఘురామ సహా మరికొందరు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్లను డిస్మిస్‌ చేసింది. ఇండ్‌ భారత్‌ పవర్‌ జెన్‌కామ్‌ లిమిటెడ్‌ పేరుతో పవర్‌ ప్లాంట్ల ఏర్పాటు, ఇతర వ్యాపార అవసరాల నిమిత్తం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) నేతృత్వంలోని బ్యాంకుల కూటమి నుంచి సుమారు రూ.237.84 కోట్లు రుణాలుగా పొందారు. అయితే ఈ నిధులను అసలు ప్రాజెక్టులకు వాడకుండా, నకిలీ కొనుగోలు పత్రాలు, తప్పుడు అకౌంట్ల ద్వారా డైరెక్టర్లు గ్రూప్‌ కంపెనీలకు మళ్లించారని బ్యాంకులు ఫిర్యాదు చేశాయి. ఎస్‌బీఐ డీజీఎం ఎస్‌.రవిచంద్రన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2021 మార్చి 24న ఢిల్లీలోని సీబీఐ కేసు నమోదు చేసింది.


ఇండ్‌ భారత్‌ పవర్‌ జెన్‌కామ్‌ లిమిటెడ్‌ (ఏ1)తో పాటు కంపెనీ డైరెక్టర్లు కనుమూరు రఘురామ కృష్ణంరాజు, కనుమూరు రమాదేవి, కనుమూరు ఇందిరా ప్రియదర్శిని, అంబేడ్కర్‌ రాజ్‌కుమార్‌ గంటా, దుంపల మధుసూధన రెడ్డి, నారాయణ ప్రసాద్‌ భగవతుల, రామచంద్ర అయ్యర్‌ బాలకృష్ణన్‌ తదితరులను నిందితులుగా చేర్చారు. ఈ కేసు కొట్టివేయాలని కోరుతూ నిందితులు మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించగా... దర్యాప్తు అధికారికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతూ ఆ పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది. హైకోర్టు తీర్పును రఘురామ సహా ఇతరులు ఈ ఏడాది జూలై 16న సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. ఆ పిటిషన్లు సోమవారం జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ శీల్‌ నాగులతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

ప్రధాని మోదీ తప్పుకునేదే లేదు.. ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్

SIR సహా అన్ని నిర్ణయాలు ఏకగ్రీవంగానే తీసుకున్నాము.. ఈసీ అఫిడవిట్

Updated Date - Oct 27 , 2026 | 05:40 AM