ముగిసిన శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సమావేశం..15 అంశాలకు ఆమోదం..
ABN , Publish Date - Aug 25 , 2026 | 08:05 PM
శ్రీశైలం దేవస్థానంలో 10వ ట్రస్ట్ బోర్డు సమావేశం ముగిసింది. మంగళవారం జరిగిన ఈ సమావేశంలో ట్రస్ట్ బోర్డు 18 అంశాలను చర్చలో పెట్టింది. 15 అంశాలకు ఆమోదం తెలపగా.. 3 అంశాలు వాయిదా పడ్డాయి.
ఇంటర్‌నెట్ డెస్క్: శ్రీశైలం దేవస్థానంలో 10వ ట్రస్ట్ బోర్డు సమావేశం ముగిసింది. మంగళవారం జరిగిన ఈ సమావేశంలో ట్రస్ట్ బోర్డు 18 అంశాలను చర్చలో పెట్టింది. 15 అంశాలకు ఆమోదం తెలపగా.. 3 అంశాలు వాయిదా పడ్డాయి. సమావేశం అనంతరం ట్రస్ట్ బోర్డు సభ్యులు మాట్లాడుతూ.. ‘భక్తుల సౌకర్యార్థం శని, ఆది, సోమవారాలలో స్పర్శదర్శనాన్ని నిలుపుదల చేశాం. భక్తుల సౌకర్యార్థం 12 వేల మంది వేచి ఉండేలా 3 అంతస్తుల క్యూ కాంప్లెక్స్ నిర్మాణాన్ని త్వరలో ప్రారంభిస్తాం. శ్రీశైల దక్షిణ ద్వారమైన జ్యోతిస్సిద్ధవట ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం’..
‘ఈ నెల 29 నుంచి 31 వరకు సిద్ధవటంలో నూతన ధ్వజప్రతిష్ఠా కార్యక్రమం చేస్తాం. 2026 -27 ఏడాదికి సంబంధించి దేవస్థాన జమా ఖర్చులు పరిశీలన జరుగుతుంది. 19 లక్షల రూపాయలతో శివసేవకుల వసతిలో పరుపులు, దిండ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. 9.20 లక్షల రూపాయలతో గణేశసదన్, రింగ్‌రోడ్డు సెంట్రల్ పార్కింగ్‌లో సిమెంట్ కాంక్రీట్ ఫ్లోరింగు వేయాలని నిర్ణయించాం. 32 లక్షల రూపాయలతో పబ్లిక్ టాయిలెట్స్, డ్రైనేజీ మరమ్మతులు, ఫ్లోరింగ్ పనులు చేయాలని తీర్మానించాం. భక్తులు సమర్పించే వస్త్రాల స్వీకరణకు ఆలయంలో వస్త్రాల స్వీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం’ అని తెలిపారు.
ఇవి కూడా చదవండి
రష్యాలో యూఎస్ ఎయిర్‌ఫోర్స్ విమానం.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న మిస్టరీ
పాన్‌మసాలా అక్రమ తయారీ కేంద్రంపై సీజీఎస్టీ దాడులు.. రూ.76 లక్షల సరుకు సీజ్