Share News

మల్లన్న హుండీ ఆదాయం రూ.4.22 కోట్లు

ABN , Publish Date - Oct 27 , 2026 | 04:40 AM

శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు భక్తులు సమర్పించిన హుండీ ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. ఉభయ దేవాలయాలు, పరివార దేవాతాలయాల హుండీల్లో గడిచిన 32 రోజులుగా భక్తుల నుంచి మొక్కులు, కానుకల రూపంలో రూ...

మల్లన్న హుండీ ఆదాయం రూ.4.22 కోట్లు

శ్రీశైలం, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు భక్తులు సమర్పించిన హుండీ ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. ఉభయ దేవాలయాలు, పరివార దేవాతాలయాల హుండీల్లో గడిచిన 32 రోజులుగా భక్తుల నుంచి మొక్కులు, కానుకల రూపంలో రూ.4,22,29,240 నగదు రూపేణా కానుకలు వచ్చినట్టు ఈఓ శ్రీనివాసరావు, పాలకమండలి చైర్మన్‌ పోతుగుంట రమేశ్‌ నాయుడు వెల్లడించారు. నగదుతో పాటు 75.300 గ్రాముల బంగారం, 2.9 కిలోల వెండి సమకూరింది. అదేవిధంగా స్వామిఅమ్మవార్లకు పలు దేశాల విదేశీ కరెన్సీని కూడా భక్తులు సమర్పించారు.

ఈ వార్తలనూ చదవండి:

బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా బలపడిన ‘అర్నబ్’

అతి తీవ్ర తుఫాను..ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

Updated Date - Oct 27 , 2026 | 04:40 AM