Share News

చంద్రఘంట అలంకరణలో భ్రమరాంబ

ABN , Publish Date - Oct 14 , 2026 | 05:17 AM

అష్టాదశ శక్తి పీఠాల్లో 6వ శక్తి పీఠమైన శ్రీశైలం మహాక్షేత్రంలో భ్రమరాంబ అమ్మవారు మంగళవారం చంద్రఘంట అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అక్కమహాదేవి అలంకార మండపంలో

చంద్రఘంట అలంకరణలో భ్రమరాంబ

శ్రీశైలం, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): అష్టాదశ శక్తి పీఠాల్లో 6వ శక్తి పీఠమైన శ్రీశైలం మహాక్షేత్రంలో భ్రమరాంబ అమ్మవారు మంగళవారం చంద్రఘంట అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అక్కమహాదేవి అలంకార మండపంలో రావణ వాహనంపై ఆశీనులైన భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్లకు వేదపండితులు పూజాక్రతువులు శాస్త్రోక్తంగా జరిపించారు. రాత్రి 11 గంటల వరకు స్వామిఅమ్మవార్ల గ్రామోత్సవం కన్నుల పండువగా సాగింది.

ఈ వార్తలనూ చదవండి:

కొత్త డీఎస్సీలో 290 పోస్టులు

గిన్నిస్‌ బుక్‌లోకి 75 గంటల డప్పుమోత

Updated Date - Oct 14 , 2026 | 05:17 AM