కూష్మాండ దుర్గగా ఆదిశక్తి
ABN , Publish Date - Oct 15 , 2026 | 05:24 AM
శ్రీశైల మహా క్షేత్రంలో దసరా శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. మహోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు బుధవారం ఆదిపరాశక్తి భ్రమరాంబదేవి కూష్మాండ దుర్గ అలంకారంలో దర్శనమిచ్చారు.
శ్రీశైలం, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల మహా క్షేత్రంలో దసరా శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. మహోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు బుధవారం ఆదిపరాశక్తి భ్రమరాంబదేవి కూష్మాండ దుర్గ అలంకారంలో దర్శనమిచ్చారు. కైలాస వాహనంపై ఆదిదంపతులు విహరించారు. ప్రధానాలయంలో ప్రత్యేక వేదికపై అమ్మవారి కూష్మాండదుర్గ అలంకార ఉత్సవ మూర్తికి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత అక్కమహాదేవి అలంకార మండపంలో కైలాస వాహనంపై ఆదిదంపతులకు షోడశోపచార పూజా క్రతువులు నిర్వహించారు. అనంతరం గ్రామోత్సవం కన్నులపండువగా సాగింది.
ఈ వార్తలనూ చదవండి:
ఆటోమేటిక్ వర్క్ పర్మిట్ ఎక్స్టెన్షన్ రద్దు.. అమెరికా ప్రభుత్వం వెల్లడి
హోర్ముజ్ జలసంధిలో మైన్ను ఢీకొని కార్గో నౌక మునక..