కాత్యాయనిగా భ్రమరాంబ
ABN , Publish Date - Oct 17 , 2026 | 04:15 AM
శ్రీశైల మహాక్షేత్రంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ఆరో రోజు శుక్రవారం భ్రమరాంబదేవి కాత్యాయని రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు.
హంస వాహనంపై ఆది దంపతుల విహారం
శ్రీశైలం, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల మహాక్షేత్రంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ఆరో రోజు శుక్రవారం భ్రమరాంబదేవి కాత్యాయని రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవ వేదికపై కాత్యాయని అమ్మవారు చతుర్భుజాలు కలిగి అభయ హస్తం, వరముద్ర, పద్మం, ఖడ్గాన్ని ధరించి పూజలందుకోగా, హంస వాహనంపై కొలువుదీరిన స్వామిఅమ్మవార్లకు అర్చకులు విశేష పూజలు జరిపించారు. అనంతరం గ్రామోత్సవంలో హంసవాహనాధీశులైన ఆదిదంపతులు పుష్పపల్లకిపై క్షేత్ర వీధుల్లో విహరించారు. కాగా శనివారం అమ్మవారు కాళరాత్రి అలంకరణలో దర్శనమిస్తారు. అదే విధంగా ఆదిదంపతులకు గజవాహన సేవ నిర్వహిస్తారు.
ఈ వార్తలనూ చదవండి:
ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు