Share News

బ్రహ్మచారిణిగా శ్రీశైల భ్రామరి

ABN , Publish Date - Oct 13 , 2026 | 04:40 AM

శ్రీశైలంలో దేవి శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. మహోత్సవాల రెండోరోజు సోమవారం భ్రమరాంబదేవి బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

బ్రహ్మచారిణిగా శ్రీశైల భ్రామరి

  • కన్నుల పండువగా గ్రామోత్సవం

శ్రీశైలం, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలంలో దేవి శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. మహోత్సవాల రెండోరోజు సోమవారం భ్రమరాంబదేవి బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అక్కమహాదేవి అలంకార మండపంలో మయూర వాహనంపై ఆశీనులైన భ్రమరాంబ దేవి, మల్లికార్జున స్వామివార్లకు పూజాక్రతువులు శాస్త్రోక్తంగా జరిపించారు. అనంతరం మయూర వాహనాధీశులైన స్వామిఅమ్మవార్లకు గ్రామోత్సవాన్ని నిర్వహించారు. కాగా, మంగళవారం భ్రమరాంబికాదేవి చంద్రఘంట అలంకారంతో రావణ వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

పెట్టుబడుల స్వర్గధామం ఏపీ

నాడు అడ్డగోలు.. నేడు గగ్గోలు

Updated Date - Oct 13 , 2026 | 04:40 AM