Share News

శ్రీకాళహస్తి ఆలయంలో పారిశుద్ధ్యంపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆగ్రహం

ABN , Publish Date - Nov 13 , 2026 | 03:14 PM

శ్రీకాళహస్తి ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు.

శ్రీకాళహస్తి ఆలయంలో పారిశుద్ధ్యంపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆగ్రహం
Srikalahasti Temple

తిరుపతి, నవంబర్ 13: జిల్లాలోని శ్రీకాళహస్తి ఆలయంలో భద్రత, పారిశుద్ధ్యం, ప్రసాదాల తయారీ నాణ్యతపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఆలయంలోని నాలుగో గోపురం వద్ద నిన్న చోటుచేసుకున్న అగ్నిప్రమాద ఘటనాస్థలిని పరిశీలించడంతో పాటు, లడ్డూ పోటు, ప్రసాదాల తయారీ కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా వంటశాలల్లో ఆధునిక పరికరాలు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిని ఎందుకు వినియోగించడం లేదని అధికారులపై, ముఖ్యంగా ఈవోపై అసహనం వ్యక్తం చేశారు. భక్తులకు నాణ్యమైన ప్రసాదాలు అందించడంతో పాటు ఆలయ పరిసరాల్లో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.


శ్రీకాళహస్తి ఆలయంలోని అన్ని వంటశాలలను ఆధునిక సదుపాయాలతో కూడిన మోడల్ కిచెన్లుగా తీర్చిదిద్దాలని మంత్రి ఆదేశించారు. ప్రసాదాల తయారీలో పరిశుభ్రమైన వాతావరణాన్ని పాటించాలని, వంటశాలల్లో ఆధునిక పరికరాలను తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. నూనె, నెయ్యి వ్యర్థాలు పేరుకుపోకుండా నిరంతరం పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, అగ్నిప్రమాదాలు పునరావృతం కాకుండా తగిన భద్రతా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి.. శ్రీకాళహస్తి ఆలయానికి సంబంధించి నిర్వహించిన ఐవీఆర్ఎస్ సర్వేలో ప్రస్తుతం 72 శాతం మేర మాత్రమే ప్రజామన్ననలు లభించాయని వెల్లడించారు. ఆలయ నిర్వహణలో నిర్లక్ష్యానికి తావులేకుండా భద్రత, పారిశుద్ధ్యం, ప్రసాదాల నాణ్యత విషయంలో నిరంతర పర్యవేక్షణ ఉండాలని మంత్రి ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి

మహారాష్ట్రలో రన్‌వే నుంచి పక్కకు దూసుకెళ్లిన విమానం..

ఇలాంటి దీపావళి చూస్తానని అనుకోలేదు.. యువతి ఆవేదన

Updated Date - Nov 13 , 2026 | 04:37 PM