Share News

వైసీపీ హయాంలోనే సర్టిఫికెట్లు లేకుండా కొలువులు

ABN , Publish Date - Sep 23 , 2026 | 05:50 AM

డీఎస్సీలో ఫేక్‌ సర్టిఫికెట్లు అంటూ వైసీపీ రాద్ధాంతం చేస్తోందని పలు క్రీడా సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే అసలు క్రీడా సర్టిఫికెట్లే లేకుండా దాదాపు 600 మందికి ఉద్యోగాలు ఇచ్చారని అన్నారు.

వైసీపీ హయాంలోనే సర్టిఫికెట్లు లేకుండా కొలువులు

స్పోర్ట్స్‌ కోటా టీచర్లపై దాడిని ఖండించిన క్రీడా సంఘాల ప్రతినిధులు

విజయవాడ, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): డీఎస్సీలో ఫేక్‌ సర్టిఫికెట్లు అంటూ వైసీపీ రాద్ధాంతం చేస్తోందని పలు క్రీడా సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే అసలు క్రీడా సర్టిఫికెట్లే లేకుండా దాదాపు 600 మందికి ఉద్యోగాలు ఇచ్చారని అన్నారు. మెగా డీఎస్సీలో స్పోర్ట్స్‌ కోటా నియామకాలపై చేస్తున్న ఆరోపణలను నిరూపించాలి కానీ.. ఇష్టారాజ్యంగా బూతులు మాట్లాడుతూ, దాడులు చేయడం సరికాదని హితవు పలికారు. తైక్వాండో ఆలిండియా వైస్‌ ప్రెసిడెంట్‌ హర్షవర్ధన్‌, ఆర్చరీ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి చెరుకూరి సత్యనారాయణ, ఒలింపిక్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రతినిధి కేపీ రావు మంగళవారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. శాప్‌ కార్యాలయం వద్ద స్పోర్ట్స్‌ కోటా ఉపాధ్యాయులపై వైసీపీ మూకల దాడిని వారు తీవ్రంగా ఖండించారు. దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు సంపాదించి ఉంటే.. అలాంటి వారిని పట్టుకోవాలని, అంతేకాని స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాలు సాధించిన వారందరిపై ఆరోపణలు చేయడం సబబు కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ వార్తలనూ చదవండి...

పాదగయలో విషాదం.. పుష్కరిణిలో స్నానానికి దిగి యువకుడి గల్లంతు..

సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

Updated Date - Sep 23 , 2026 | 05:50 AM