రేపు ప్రధాని మోదీ పేరిట పూజలు
ABN , Publish Date - Oct 06 , 2026 | 06:24 AM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజాప్రస్థానం పూర్తి చేస్తున్న సందర్భంగా ఈ నెల 7న విజయవాడ ఇంద్రకీలాద్రిపైన ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో ప్రధాని పేరిట ప్రత్యేకంగా ఖడ్గమాలార్చన నిర్వహిస్తున్నట్లు జనసేన ఎంపీ లింగమనేని రమేశ్ తెలిపారు.
జనసేన ఎంపీ లింగమనేని రమేశ్ వెల్లడి
అమరావతి, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజాప్రస్థానం పూర్తి చేస్తున్న సందర్భంగా ఈ నెల 7న విజయవాడ ఇంద్రకీలాద్రిపైన ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో ప్రధాని పేరిట ప్రత్యేకంగా ఖడ్గమాలార్చన నిర్వహిస్తున్నట్లు జనసేన ఎంపీ లింగమనేని రమేశ్ తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. దుర్గమ్మ ఆలయంలో బుధవారం తెల్లవారుజామున ఖడ్గమాలార్చన నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మోదీ నాయకత్వం మరింత బలోపేతం కావాలని, ఆయనకు దుర్గమ్మ దీవెనలు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు రమేశ్ పేర్కొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం.. ఉద్యోగుల శిక్షణపై సీఎం స్పెషల్ ఫోకస్
ఏపీలో నాలుగు కొత్త పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం