Share News

గ్రేడ్‌-3 ఏఎన్‌ఎంలకు స్పెషల్‌ గ్రేడ్‌ పోస్టు స్కేల్‌

ABN , Publish Date - Oct 03 , 2026 | 04:40 AM

గ్రామ, వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహించే గ్రేడ్‌-3 ఏఎన్‌ఎంలకు ఆటోమెటిక్‌ ఆడ్వాన్స్‌మెంట్‌ స్కీమ్‌ కింద స్పెషల్‌ గ్రేడ్‌ పోస్టు స్కేల్‌ ఇచ్చేందుకు ఆరోగ్యశాఖ సిద్ధమైంది.

గ్రేడ్‌-3 ఏఎన్‌ఎంలకు స్పెషల్‌ గ్రేడ్‌ పోస్టు స్కేల్‌

  • ఆరేళ్ల సర్వీసు పూర్తయిన వారందరికీ అమలు

  • డీఎంహెచ్‌వోలకు ఆరోగ్య శాఖ కమిషనర్‌ లేఖ

అమరావతి, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): గ్రామ, వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహించే గ్రేడ్‌-3 ఏఎన్‌ఎంలకు ఆటోమెటిక్‌ ఆడ్వాన్స్‌మెంట్‌ స్కీమ్‌ కింద స్పెషల్‌ గ్రేడ్‌ పోస్టు స్కేల్‌ ఇచ్చేందుకు ఆరోగ్యశాఖ సిద్ధమైంది. విధుల్లో చేరి ఆరేళ్లు పూర్తయిన సిబ్బందికి దీనిని అమలు చేయనుంది. ఈ మేరకు జిల్లాల్లోని డీఎంహెచ్‌వోలకు ఆరోగ్యశాఖ కమిషనర్‌ లేఖ రాశారు. రాష్ట్రంలో అందరు డీఎంహెచ్‌వోలు వారి పరిధిలో విధులు నిర్వహించే గ్రేడ్‌-3 ఏఎన్‌ఎంలను గుర్తించి, వారిలో ఆరేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారి వివరాలతో కూడిన జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారందరికీ స్పెషల్‌ గ్రేడ్‌ పోస్టు స్కేల్‌ అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయా వివరాలను పాత జిల్లాల డీఎంహెచ్‌వోలకు పంపించాలని కమిషనర్‌ ఆదేశించారు.

ఈ వార్తలనూ చదవండి..

స్వచ్ఛతే ఆరోగ్యానికి తొలిమెట్టు

శ్రీవారి ఆలయానికి ‘స్వచ్ఛ’ అవార్డు

Updated Date - Oct 03 , 2026 | 04:40 AM